💥 *అత్యవసర ఫోన్ నంబర్లు* 💥
👉1.దుఖఃంలో ఉన్నప్పుడు .-యోహాను14ను పిలవండి
👉2.దుష్టులు నీ మీదకి వచ్చినపుడు-కీర్తన27ను పిలవండి
👉3.ఆత్మీయంగా ఫలించాలనుకున్నప్పుడు-యోహాను15ను పిలవండి
👉4.పాపంలో పడినప్పుడు-కీర్తన51ను పిలవండి
👉5.బహుగా చింతించుచున్నప్పుడు-మత్తయి6:19-34ను పిలవండి
👉6.బహు ప్రమాదంలో చిక్కినప్పుడు-కీర్తన91ను పిలవండి
👉7.దేవుడు నీకు దూరమైపోయాడు అని అనిపిస్తే-కీర్తన139ను పిలవండి
👉8.విశ్వాసం వీగిపోతుంటే-హెబ్రి11ను పిలవండి
👉9.ఒంటరిగాపయనిస్తూ భయపడితే-కీర్తన23ను పిలవండి
👉10.ద్వేషం,కోపం,పగతో నిండిపోతే-1కొరింథీ13ను పిలవండి
👉11.సంతోషంగా బ్రతకాలనిపిస్తే-కొలస్సీ3:12-17ను పిలవండి
👉12.క్రైస్తవ్యాన్ని తెల్సుకోవాలంటే-2కొరింథీ5:15-19ను పిలవండి
👉13.విరోధులెదురై నిరాశ చెందితే-రోమా8:31,32ను పిలవండి
👉14.విశ్రాంతి కరువైతే-మత్తయి11:25-30ను పిలవండి
👉15.దేవుని యొక్క అభయం కావాలనుకున్నపుడు-రోమా8:1-30ను పిలవండి
👉16.ఇంటికి దూరమైనప్పుడు-కీర్తన121ను పిలవండి
👉17.ధైర్యము కొరవడినప్పుడు-యెహోషువ1ను పిలవండి
👉18.మనోవ్యాకులతతో నిండినప్పుడు-కీర్తన27ను పిలవండి
ఈ మెసేజ్ ప్రతి విశ్వసికి వెళ్ళేటట్లు అందరూ షేర్ చేయండి ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు కబ్బాట్టి వాక్యాన్ని అందించి బలపరచండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
19, నవంబర్ 2017, ఆదివారం
💥 *అత్యవసర ఫోన్ నంబర్లు* 💥
17, నవంబర్ 2017, శుక్రవారం
*📖బైబిల్ లో తప్పులను వెదక ప్రయత్నించిన కొందరి సాక్షములు:📖*_
_*📖బైబిల్ లో తప్పులను వెదక ప్రయత్నించిన కొందరి సాక్షములు:📖*_
_*📖1. బ్రదర్.భక్త్ సింగ్: బైబిల్ లోని పేజీలన్ని కాల్చేసి, అట్ట బాగుందని ఉంచుకున్నాడు. ఒకానొక సందర్భములో అట్టపై "పరిశుద్ధ" అనే పదానికి ఆకర్షితుడై ఆ గ్రంథాన్ని చదివి క్రైస్తవునిగా మారెను. ప్రపంచవ్యాప్తముగా సుమారు పదివేల సంఘాలు (CHURCHES) స్థాపించిన ఏకైక భారతీయునిగా సాక్ష్యము పొందెను.*_
_*📖2. బ్రదర్. సాధువు సుందర్ సింగ్: ఒక నిష్ఠయైన సాధువు దర్శనరీతిగా "క్రీస్తు ప్రత్యక్షతను" పొంది క్రైస్తవునిగా మారి ప్రపంచవ్యాప్తముగా క్రీస్తును ప్రకటించిన ఒక భారతీయుడు.*_
_*📖3. రెవ.ఆర్.ఆర్.కె.మూర్తి: నిష్ఠయైన బ్రాహ్మణ కుటుంబము నుంచి యోహాను సువార్త ద్వారా క్రైస్తవునిగా మారిన వ్యక్తి. క్రీస్తు కొరకు కుటుంబాన్ని పరిత్యజించుటకు సహితము సిద్ధపడినవారు. బైబిల్ చదివి ఆయన పలికిన మాట, "బైబిల్లో తప్పులను వెదకాలని బైబిల్ చదవటం ప్రారంభించాను కానీ బైబిల్ నాలోని తప్పుల్ని పట్టుకుంది."*_
_*📖4. రెవ.పురుషోత్తమ చౌదరి: రోడ్ మీద దొరికిన బైబిల్లోని ఒక చిన్న కాగితము ముక్క ద్వారా బైబిల్ చదువుటకు ప్రేరేపించబడి క్రైస్తవునిగా మారెను. ఈయన ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడైనప్పట్టికీ తెలుగు రాష్ట్రాలలో నేడు క్రైస్తవులు పాడే కీర్తనలలో సగానికి పైగా ఈయన రాసినవే...*_
_*కొన్ని కోట్ల రూపాయల జీతానికి బైబిల్ ను తప్పు పట్టుటయే ఒక ఉద్యోగముగా పెట్టుకున్న భారతదేశానికి చెందిన ఒక విద్యావేత్త తనకి జీతమిస్తానన్న మతచాందస్సవాదితో (పేర్లు తీసుకొనలేదు) పలికిన మాట, "బైబిల్ ను తప్పుపట్టడం నా వల్ల కాదు, బైబిల్ నన్ను లొంగదీసుకుంది." బైబిల్ ను నిర్మూలించుట కొరకు ఒక రాజు (OTTO) చేత కోట్లాది డాలర్ల జీతానికి నియమించబడిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రపంచ మేధావి, బైబిల్ పూర్తిగా చదివి ఆ రాజుతో చెప్పిన మాట,*_
_*🔴1. ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవగ్రంథము.*_
*_🔴2. అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము (14వ శతాబ్ధం)._*
_*🔴3. అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము.*_
_*🔴4. ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడుపోయే, చదవబడే ఏకైక దైవ గ్రంథము.*_
_*🔴5. నిజ దేవుని గూర్చి సరైన, సులువైన నిర్వచనము, ఆధారము, అవగాహనను యిచ్చే ఏకైక దైవ గ్రంథము.*_
_*🔴6. లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు.*_
_*🔴7. 70% మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము.*_
_*🔴8. విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము.*_
_*🔴9. విద్యుత్ బల్బు తయారు చేసి, ఆ బల్బ్ వెలుగులో చూడబడిన, చదవబడిన మొట్టమొదటి గ్రంథము. బల్బ్ తయారుచేసిన థామస్ ఆల్వ ఎడిసన్ పలికిన మాట, "బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను."*_
_*🔴10. బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు.*_
_*🔴11. బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు వెయ్యి పేజీలలో "పరిశుద్ధత" అనే పదము పేజీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్రాయబడియున్నది (వెయ్యిని ఎనభై సార్లు). మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం వంద పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా బైబిలే... ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసికొంటున్న ఏకైన దైవ గ్రంథము బైబిల్.*_
*_✳ఇది అనేకులకు పంపి ఆశీర్వాదం పొందండి.✳_*
3, జులై 2017, సోమవారం
⛪ ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు-
**⛪ ⛪⛪ ఆరాధనకి
వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- కనీస క్రమశిక్షణ ఎలా ఉండాలి.... ?
ప్రియ దేవుని సంఘమా!
🔺మనమందరం ఆదివారం ఆరాధనకి వెల్లడానికి ఇష్టపడతాం.(దేవుణ్ణి ప్రేమించే వారంతా).
🔺అయితే ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన మీద – వాక్యం మీద మన మనస్సు, ధ్యానం లఘ్నం చేస్తున్నామా లేదా?
🔺 ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ? కొంచెం ఆలోచిద్దాం.
▪దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చు చున్నాడు. కీర్తన 82:1.
దీనికి సపోర్టింగ్ రిఫరెన్సు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుంటారో వారి మధ్య నేను వుంటాను అని యేసయ్య సెలవిచ్చారు. మత్తయి 18:20;
🔹కాబట్టి దేవుని ఆలయంలో దేవుడు వున్నారు,
🔹ఆయనకి భయపడాలి,
🔹 ఆయనని గౌరవించాలి అన్న ధ్యాస మనలో వుంటే, వాక్యం మీదనే లక్ష్యం ఉంచుతాం తప్ప ఇటు అటు చూడము, ఇటు అటు తిరగం.
ఆయన దేవాదిదేవుడు రాజాధిరాజు, మహోన్నతుడు. (కీర్తనలు గ్రంధం). ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అన్న పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, భయంకరుడైన (reverend--- ఆయన మాత్రమే). ఆయనని ఆరాధించడానికి వచ్చియున్నాము అన్న విషయం గుర్తుంటే దేవుని సన్నిధిని అజాగ్రత్తగా ఉండము.
🔹మరికొంతమంది ఆరాధనలో నిద్రపోతూ వుంటారు.
🔹ఇంకొంతమంది ప్రక్కవారితో మాట్లాడుకొంటూ వుంటారు.
🔹 మొబైల్ లో గేమ్ ఆడుకొనేది కొంతమంది.
🔹 ఆదివారం నాడు ఆరాధనకి రాకుండా సినిమాలకి, షికార్లకి వెళ్ళేవారు కొంతమంది.
కీర్తన 84:10, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది. అదేవిధంగా ఒక్క దినం మిస్ అవడం వెయ్యి దినాల ఆశీర్వాదంను పోగొట్టుకోవడమే. అందుకే ఆరాధనకి వస్తాము, వచ్చి నిద్రపోతాం. వాక్యం వినం. దానివల్ల ప్రయోజనం లేదు.
🔹 ప్రసంగం అయ్యాక వచ్చేది కొంతమంది. కానుకల సమయంలో గాని, ఆశీర్వాదం ఇచ్చే సమయంలో గాని వచ్చేవారు కొంతమంది.
🔹 వారి ఆలోచన ఆదివారంనాడు గుడికి వచ్చి, Attendance వేయిన్చుకొంటే చాలు.1000 days blessings వచేస్తాయ్ అని పొరబడుతున్నారు.
👉అలా చేస్తే దేవుని ఆశీర్వదాలకి ప్రతికూలంగా దేవుని శాపాన్ని పొందుకొంటున్నావ్ అని మర్చిపోకు.
👉మరి ఏం చెయ్యాలి???
👉 1.మొదటగా దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము. ప్రసంగీ 5:1
నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వస్త్రధారణ అన్ని జాగ్రతగాచూసుకోవాలి. ఎందుకు? ముందు చెప్పిన విధంగా దేవుడు మనమధ్య వున్నారు, ఆయన రాజులరాజు, ప్రభువుల ప్రభువు, భయంకరుడైన దేవుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి.
దయచేసి ఒక విషయం గమనించాలి. మనం వెళ్ళేది మార్కెట్ కి కాదు, సినిమా హాల్ కి కూడా కాదు. క్రిస్టియన్ గెట్ టుగెదర్ కి అంతకన్నా కాదు, పెళ్ళికో , ఫంక్షన్ కో, వ్యాపారానికో కూడా కాదు. రారాజుని పూజించటానికి వెళ్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన, మన వస్త్రధారణ క్రమబద్ధంగా వుండాలి . కొంతమంది యువతి యువకులు నేటి కాలంలో ఘోరమైన వస్త్రధారణతో సంఘానికి వస్తున్నారు. Tight T-shirt వేసుకొని, ఖండలు, 6 pack చూపించేవారు కొంతమంది. స్త్రీలు పెదాలకి రంగు, కనుబోమలకి రంగు, ఇంకా భయంకరమైన వస్త్రధారణతో వస్తున్నారు. విచారం ఏమిటంటే, మాదిరిగా ఉండాల్సిన సేవకుల భార్యలు, పిల్లలు సంఘస్తుల కంటే భయంకరంగా తయారై , బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేషం వేసుకొని సంఘానికి వస్తున్నారు. ఇక సంఘస్తులు ఇంక ఎలా వుంటారు.
CHURCH IS NOT A FASHION SHOW.
మన వస్త్రధారణ, నడక దేవునికి అనుకూలంగా వుండాలి గాని, లోకస్తులు చేసినట్టు, లోకాన్ని మరియు ఇతరురలను ఆకర్షించేదిగా ఉండరాదు. ఒక కలెక్టర్ ఆఫీస్ కి ఆ రకమైన వస్త్రధారణతో వెళ్ళగలవా? దయచేసి గమనించమని మనవి.
👉2 . ఆరాధనకి వచ్చి నిద్రపోతారు.
🔺దేవుడంటే భయం వుంటే నీకు నిద్రరాదు.
🔺 దేవుడంటే నిజమైన ప్రేమ వున్నా నిద్ర రాదు.
👉ప్రియ సహోదరీ/సహోదరుడా! శనివారం నాడు సాయంత్రం తర్వాత దయచేసి TV చూడకు,TV కట్టేసి, ప్రార్ధన చేసుకొని, భోజనం చేసి తొందరగా నిద్రపో! ఆదివారం గుడిలో నీకు నిద్రరాదు. రాత్రి ఒంటిగంట వరకు నివు TV చూస్తే నీకు ఆదివారం చర్చి లో నిద్ర వస్తుంది.
🔺చాల మంది ఆదివారం నాడే పనులు పెట్టుకొంటారు. ఎదో మ్రొక్కుబడికి గుడికి వచ్చిన వాక్యం వినరు. మీరు చేసేది ఆచారం తప్ప ఆరాధన కాదు. దేవునికి మీ ఆచారాలు అవసరం లేదు. ఆత్మతోను సత్యం తోనూ చేసే ఆరాధన కావాలి.
👉 3. దయచేసి ఆరాధనలో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక రెండు మూడు గంటలు మీ మొబైల్ కట్టేస్తే కొంపలు మునిగిపోయేదేమి లేదు. నీవు ఎవరో ముఖ్యమైన వారిని కలిసి నప్పుడు గాని, ఒక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గాని మొబైల్ కట్టేస్తావ్ కదా. ఆ కలెక్టర్ ని కూడా పుట్టించింది నా యేసయ్య అని మర్చిపోతున్నావ్. మరి చర్చి లో ఎందుకీ మొబైల్ ఆపడం లేదు.
▪మొబైల్ లో గేమ్స్ ఆడుకొనే వారు కొంతమంది.
▪కొంతమంది మొబైల్ లో బైబుల్ వుంది అందుకే ఆపడం లేదు అంటారు.
▪ప్రియ దేవుని బిడ్డా! మొబైల్ లో బైబుల్ ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు చదువుకోడానికే తప్ప ఆదివారం ఉపయోగించడానికి కాదు.
▪నివు దైవ గ్రంధాన్ని మోస్తే అది నిన్ను ఒకరోజు మోస్తుంది. మరి ముక్యంగా అది జీవ గ్రంధం.దానిని ప్రతీరోజు చదవాలి అంతే కాకుండా ఆదివారం గుడికి తీసుకు రావాలి. అలా కాకుండా మొబైల్ తో సరిపెట్టుకోగూడదు.
🔺నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి ఇచ్చే మర్యాద ఇదేనా?
🔹నీ మొబైల్ లో బైబుల్ తో పాటు ఇంకా ఏమేమి వున్నాయి? సినిమా పాటలు, గేమ్స్ , ఇంకా నానా చెత్త అంత దానిలోనే స్టోర్ చేస్తున్నావ్ కదా. వాటి ప్రక్కనే బైబుల్.
🔺 దయచేసి బైబుల్ ని మోయండి. బైబుల్ కి ఇచ్చే ప్రాధాన్యత బైబుల్ కి ఇవ్వండి.
👉 4. ప్రార్ధనా పూర్వకంగా రావాలి. ప్రభువా ఈరోజు నాతొ మాట్లాడండి. నన్ను నీ ఆత్మతో తాకండి, ముట్టండి. అని ప్రార్ధన పూర్వకంగా వస్తే దేవుడు తప్పకుండా తన మెల్లని చల్లని స్వరం నీకు వినిపిస్తారు. ఎదో విదంగా, ఎదో రకంగా దేవుడు నీతో మాట్లాడతారు.
Do not Expect Anything If You Do not Concentrate On Word Of God.
👉 5. నీకు ఎవరిమీదనైన కోపం, ద్వేషం గాని వుంటే మొదట వారితో సమాధాన పడు. లేదా ఆ వారంలో నీవు ఎవరినైన ఏమైనా అంటే, ఎవరినైనా నొప్పించి వుంటే మొదట వారిని క్షమాపణ అడుగు. లేకపోతె నివు గుడిలో ప్రార్ధించడం మొదలుపెట్టిన వెంటనే సాతాను గాడు గొప్ప ప్రార్ధన చేసేస్తున్నావ్ గాని ఫలాని వాళ్ళని ఇన్ని మాటలు అన్నావ్. ఇప్పుడు ఏమి ఎరగనట్టు ప్రార్ధన చేస్తున్నావ్. దేవుడు నీ ప్రార్ధన వింటాడా? వినడు. అని నీకు చెప్పి నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆపెస్తుంటాడు. వాడి మాటలు విన్నావా నీవ్ చివరకు బ్రష్టుడవైపోతావ్. అందుకే దేవుని దగ్గర మరియు ఆ వ్యక్తీ దగ్గర క్షమాపణ అడుగు. నీ ఇగో ని వదిలేయ్. నిన్నూ పరలోకం చేర్చేది నీ ఇగో కాదు. ఒకసారి నీ ఇగో వదేలేయ్. నీకు మనశ్శాంతి , ఆ వ్యక్తీ నీకు మద్య శాంతి. దేవునితోను ఆ వ్యక్తితోను సమాధానం కలిగి వుంటావ్. నీ ఇగో ని సంతృప్తి పరచాలని చూసావా 100% నరకానికి పోతావ్.
👉దయచేసి ఈ రకమైన సిద్దపాటు క్రమశిక్షణ కలిగి ఆరాధనకి వస్తే ఆ ఆరాధన నీకు ఆశీర్వదకరంగా వుంటుంది,
👉మరుసటి ఆదివారం ఎప్పుడొస్తుందా అని నీ హృదయం తహతహలాడుతుంది.
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమెన్.
----------------------------------------------------------
21, జూన్ 2017, బుధవారం
✳ క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా? ✳
✳ క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా? ✳
👉ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలి అంటే ఆచరించకూడదు అని చెప్పాలి.
👉మన ప్రధాని మోడీ తన హిందూ మతాన్ని అందరూ ఆచరించాలి అని చేయని వాిశ్వప్రయత్నం లేదు. ఒకప్పుడు R.S.S లీడర్ గా ఒక వెలుగు వెలుగు వెలిగిన ప్రధాని మోడీకి వున్న ఈ ఆసక్తి ఆశ్చర్యం కలిగించేది ఏమి కాదు.
.
👉 అయితే దేవుని జ్ఞానం లేని కొంతమంది క్రైస్తవులు కూడా ఈ యోగా ధినోత్సవమును ఆనందముగా జరుపుకున్నారు. ఇంకా బాధించదగిన విషయం ఏదనగా “ప్రభువుదినమైన” ఆదివారమును కొంతమంది సంఘకాపరులు వారి వారి సంఘాల్లో జరుపుకున్నారు (Church Service that Included Yoga).
సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
👉యోగా అంటే ఏమిటి?
👉 “యోగా అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది దీని అర్ధం “ఏకమవుట” లేక “కలిసిపోవుట”.
🔺యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం “ముక్తిని లేక రక్షణను పొందుట”.
🔹 యోగాలో అనేకమైన పద్ధతులు వున్నాయి.
🔸 “ధ్యానం” అన్నీ యోగా పద్ధతులకు మూలమై వున్నది.
👉 మరి ఈ ధ్యానం అనగా ఏంటో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి.
🔺 “ధ్యానం అనగా మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం”.
🔺 ఇలా మనుష్యుని ఆత్మను, బ్రహ్మ అనే దేవుని ఆత్మతో సంధి చేయటాన్ని మోక్షం (Moksha) అంటారు.
👉ఎంత అవివేకం క్రీస్తు యేసునందు దేవుడిచ్చే ఉచిత రక్షణను (ఎఫిసీయులకు 2: 8 – 9) మనుష్యులు వారి సాధనతో కొనుక్కోవాలి అనుకోవటమా?.
🔺క్రైస్తవుడిగా అది ఎన్నటికీ మనం చేయకూడదు. ఇప్పుడు అర్ధమైంది అనుకుంటున్నాను యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం ఏమిటో.
👉ఆరోగ్యకరమైన ఉపయోగాలు వుంటే యోగాను క్రైస్తవులు ఎందుకు చేయకూడదు:
🔺ఈ సందేహం చాలా మంది క్రైస్తవులలో కలుగుతుంది.
🔹మనం ప్రతి రోజూ చేసే వ్యాయామాల వలన మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.
🔸 ఆరోగ్యముగా ఉండుటకు ఇటువంటి వ్యాయామాలు చేయటంలో క్రైస్తవులకు ఎటువంటి తప్పు లేదు.
👉అయితే యోగా అభ్యాసము చాలా భిన్నమైనది.
🔺యోగాలో వ్యాయామము మాత్రమే లేదు,
🔺యోగా వ్యాయామముతో కూడిన ధ్యానము.
👉యోగా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏదనగా “మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం” ఇధి వ్యర్ధమైన ప్రయత్నం.
👉మన రక్షణకు యేసే మార్గం. ఈ రక్షణను వివిధ పద్ధతుల ద్వారా కొనుక్కోలేము.
యోహాను 14: 6:
“యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”.
అపోస్తులుల కార్యములు 4: 12“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను”.
యేసుక్రీస్తు నందు విశ్వాసంచేత దేవుడిచ్చిన కృపావరమే “రక్షణ” మరే విధముగా దానిని పొందలేము.
ఎఫిసీయులకు 2: 8 – 9:
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”.
👉మనం క్రైస్తవులము ఈ లోక సంభందులం కాదు అని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ లోకసంభందులు అనేక వ్యర్ధమైన క్రియలు చేస్తూ వుంటారు వాటన్నిటికీ మనం దూరముగా వుండాలి.
రోమియూలకు 12: 2:
“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”.
👉ఒక క్రైస్తవుడిగా దేవుని వాక్యమే మనము ధ్యానించాలి గాని , వ్యర్ధమైన నామములు కాదు. మరే నామము వలన రక్షణ కలుగదు గాని యేసయ్య నామమందు మాత్రమే రక్షణ కలుగును (అపోస్తులుల కార్యములు 4: 12)
కీర్తనలు 1:2:
“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు”.
ఆమేన్.
*🌴 పగటి రోజు🌴*
*🌴 పగటి రోజు🌴*
*♦13 గంటల 7 నిమిషాల పాటు పగలు*
గుడివాడలో తొలి సూర్యోదయం
నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.
®చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.
ఏటా జూన్ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.
*♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ*
ఈ నెల 21వ తేదీ మనదేశంలోని *మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.*
ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
20, జూన్ 2017, మంగళవారం
💐 GOOD SERVANT 💐
✳ భళా, నమ్మకమైన మంచి దాసుడా. . . .✍
👉ఈ నమ్మకమైన వాడు....ఎవరు...?
( మత్తయి 25:21 ) " అతని యజమానుడు (వానితో ) భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. . . . " అని అనెను.
ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానవాక్యంలోని ఒక బాగము. . . .
ఒక్కసారి అలోచిదం bibleలో ఎంతమంది ఇలాంటి నమ్మకమైన మంచి దాసులు ఉన్నారు ?
చాలా మంది నమ్మకమైన మంచి దాసులు ఉన్నా అసలు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మనకి గుర్తుకు వచ్చే కొన్ని పేర్లు అబ్రాహాముగారు , అబ్రాహాము యింటి పెద్దదాసుడు అయిన ఎలియాజారుగారు , మోషేగారు, యెహొషువగారు, ఎలియాగారు, అపొస్తలుడైన పేతురుగారు, అపొస్తలుడైన పౌలుగారు, మీగిలిన అపొస్తలులు, మరియు దేవుని ఎదుట నమ్మకమైన మంచి దాసుడిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మనకి కనిపిస్తారు.
కానీ. . . .
👉మనం చుసినా చూడనట్లు, చదివినా చదవనట్లు ఉండే ఒక నమ్మకమైన మంచి దాసుడు మనకి bibleలో ఉన్నాడు.
➡ అతనెవరో గుర్తొచ్చిందా ?
అతను ఎవరో కాదు ; అతనే " హిత్తీయుడగు ఊరియా "
* మూలవాక్యం ( సమూయేలు రెండవ గ్రంథము 11 : 1-27 ) మరియు ( సమూయేలు రెండవ గ్రంథము 12 : 1-15 ).
👉అది వసంతకాలము అని ఆ కాలమున రాజులు ఎక్కువగా యుద్ధమునకు బయలుదేరువారని వ్రాయబడి ఉన్నది,
🔺కానీ దావీదు మాత్రం తన మందిరంలోనే ఉన్నాడు,
🔺తన రాజ్జ్యం యొక్క రక్షణ విషయంలో దావీదు క్రమంతప్పాడు,
🔺అలాగే దావీదు ఎప్పుడు లేచాడు ? ప్రొద్దుగ్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచాడు.
🔺తన జీవన విధానంలో కూడ దావీదు క్రమంతప్పాడు,
👉ఎప్పుడేతే మనం క్రమం తప్పుతామో అప్పుడే మనం పాపంలోకి నేట్టబడుతము.
🔺 దావీదు కుడా పాపమునకు లోనయ్యాడు....ఆ యువతీ....ఆ బత్షెబ హిత్తీయుడగు ఊరియాకు భార్య అని తెలిసినా ఆ బత్షెబతో పాపం చేసాడు. తరువాత ఆ స్త్రీ గర్భవతి అయిన విషయం దావీదుకు తెలియగా, తన మీద పడనున్న నిందని గమనించిన దావీదు ఒక ఆలోచన చేసాడు. . . .
🔹అది. . . .దావీదు, ఊరియాను నాయొద్దకు పంపుమని ఆజ్ఞ ఇచ్చెను.
ఊరియా దావీదునొద్దకురాగా దావీదు ఊరియా యొక్క యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను.
🔹తరువాత దావీదు ఊరియాతో నీవు ఇంటికిపోయి శ్రమతీర్చుకొనుమని సెలవిచ్చెను.
🔺కానీ ఊరియా తన యింటికి వెళ్లక దావీదుకి ఉన్న ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొనెను.
ఈ విషయం దావీదుకి తెలియగా, దావీదు మరలా ఊరియాను భోజనమునకు పిలిచి; అతడు బాగా తిని,త్రాగిన తరువాత దావీదు అతని బాగా మత్తునిగా చేసి ఇంటికి పంపెను;
🔺కానీ ఆ సాయంత్రము కూడా ఊరియా బయటకి వెళ్లి తన యింటికి పోక దావీదుకి ఉన్న ఇతర సేవకుల మధ్య పడక మీద పండుకొనెను.
ఈ రెండవ రోజు కూడా ఊరియా తన ఇంటికి పోలేదని దావీదుకి తెలిసింది.
👉అసలు దావీదు ఆలోచన ఏమిటి. . . ?
బత్షెబ గర్భవతి; అ నింద తన మీదకి రాకుండా ఉండుటకు ఆ సమయంలో యుద్ధంలో ఉన్న ఊరియాను పిలిచి తన ఇంటికి పంపితే అతను పోయి తన బార్యతో కుడితే బత్షెబ గర్భవతి అగుటకు ఊరియానే కారణం అనుటకు అవకాశం ఉంది, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు అని దావీదు ఆలోచన అందుకే పనిమాలా ఊరియాను పిలిపించి ఇంటికి పంపాడు శ్రమ తీర్చుకొనుమని సెలవిచ్చెను.
అయిన ఊరియా ఇంటికి పోలేదు, చెబితే పోలేదు కనుక ఈసారి దావీదు అతని మత్తునిగా చేసి ఇంటికి పంపెను తాగిన మత్తులో ఇంటికి పోయి బార్యతో కూడతాడు అని కానీ ఊరియా ఇంటికి పోలేదు.
🔺దావీదు నీవు యింటికి వెళ్లక పోతివేమని అడిగినప్పుడు ఇవి ఏవి తెలియని ఊరియా ఏమి చెప్పాడో తెలుసా ?
👉అప్పుడు ఊరియా "దేవుని మందసమును ఇశ్రాయేలువారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులోనుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా ?"
ఓ రాజా....నీ తోడు, నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని....దావీదుతో అనెను.
చూసారా....ఊరియాయొక్క రాజభక్తి, తన రాజు ఇంటికి పోయి ఆనందించు అనినను ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొన్నాడు, తరువాత దావీదు అతని మత్తునిగా చేసి ఇంటికి పంపినను ఆ మత్తులో ఊరియా ఇంటికి పోలేదు, పోయి అనందించలేదు ఆ రోజు కూడా ఇతర సేవకులతో కూడ రాజనగరి ద్వారమున పండుకొన్నాడు,
తన తోటి సేవకులు బయట దండులో యుద్ధంలోనుండగా, నేను భోజన పానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా ? అంటాడు ఊరియా. . . .
👉అదే ఊరియాయొక్క రాజభక్తి.
ఊరియా ఏంత నమ్మకమైనవాడో మనకి చూపే మరో విషయం ఈ వాక్యంలోనే మనకి కనిపిస్తుంది. . . .
అది. . . .( సమూయేలు రెండవ గ్రంథము 11 : 14-15 )
". . . .దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని; యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. "
ఏంత ప్రయత్నం చేసిన ఊరియా తన ఇంటికి పోకపోవడంతో దావీదు తన చివరి నిర్ణయం తీసుకున్నాడు అది ఊరియాని చంపించాలి అని.
🔺మీరు గమనించారా ?
ఇందులో ఊరియా ఏంత నమ్మకమైనవాడో మనకి చూపే విషయం ఏముంది ?
( సమూయేలు రెండవ గ్రంథము 11 : 15 ) " యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. "
ఊరియా యుద్ధంలో చనిపోయేలా చేయమని దావీదు యోవాబునకు ఒక ఉత్తరము వ్రాయించి అది మరలా ఊరియాచేత యోవాబునకు పంపించెను.
👉దావీదు తనతో పంపుతున్నది ఏమిటో చూదం అని ఒక్క సారి ఆ ఉత్తరము చూస్తే తెలిసేది తాను తీసుకుపోతుంది తన మరణశాసనం అని, అది చూసుంటే ఊరియా చావునుండి బయటపడేవాడు. . . .కాదంటారా ?
🔺కానీ ఊరియా ఆ ఉత్తరము ఏమిటో....అని చూడలేదు,
🔺చుడాలని కుడా అనుకోలేదు,
🔺తన రాజుకి నమ్మకంగా పనిచేసాడు.
➡ భళా, నమ్మకమైన మంచి దాసుడా. . . . అని పిలిపిచుకోనుటకు ఊరియా అర్హుడు.
"దావీదు నిజంగా గొప్ప విశ్వాస వీరుడు" "కాదు" అని మనం ఎంతమాత్రమూ అనలేము,
👉కానీ దావీదు చేసిన ఈ కార్యం దేవునికి దుష్కార్యముగా అనిపించింది అని దేవుని వాక్యం చెబుతుంది.
( 2 సమూయేలు 11 : 27 )
". . . .అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. "
(2 సమూయేలు 11 : 1-27) మరియు (2 సమూయేలు 12 : 1-15) లో
👉మనకి ఒక గొప్ప విశ్వాస వీరుడి (దావీదు) పతనం,
👉అదే సమయంలో
ఒక నమ్మకమైన మంచి దాసుడు (హిత్తీయుడగు ఊరియా) ని చూడగలం. . . .
" భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. . . ."
హల్లెలూయ. . . .
---------------------------------------------------------