14, ఫిబ్రవరి 2018, బుధవారం

Love letter

💖 💖 యేసు ప్రేమ లేఖ 💖 💖

ఈ ప్రశ్న యూత్ ను అడిగామనుకోండి!,
ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం, లాంటి వేదాంత ధోరణి మాటలనుండి,
ప్రేమ గుడ్డిది, నడ్డిది, చెవిటిది లాంటి బరువైన మాటల వరకూ ఇంకా చాలానే చెబుతారు.

❣ మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకూ నిజాయితీ ఉంది?
❣ ప్రేమంటే అర్థం అంతేనా?
❣ ప్రేమను గురించి బైబిల్ ఏం చెబుతుంది?

మనం బైబిల్ చదివినపుడు, బైబిలంతటిలోనూ మనపై దేవునికున్న ప్రేమ స్పష్టంగా కన్పిస్తుంది.

💖దేవుడు మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్ 💖

మరి ప్రేమంటే బైబిల్ ఏమని నిర్వచిస్తోంది?

1కొరింథీ13:4-13 లో ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి.

💖 ప్రేమ దీర్ఘకాలం సహించును

💖 ప్రేమ దయ చూపించును

💖 ప్రేమ మత్సరపడదు

💖 ప్రేమ డంబముగా ప్రవర్తింపదు

💖 ప్రేమ ఉప్పొంగదు

💖 ప్రేమ అమర్యాదగా నడవదు

💖 ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు

💖 ప్రేమ కోపపడదు

💖 ప్రేమ అపకారం చేయదు

💖 ప్రేమ సత్యమునందు సంతోషించును

💖 ప్రేమ అన్నిటికీ తాళుకొనును

💖 ప్రేమ అన్నిటినీ నమ్మును

💖 ప్రేమ అన్నిటినీ నిరీక్షించును

💖 ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును

💖 ప్రేమ శాశ్వతకాలముండును

💖 ప్రేమ దోషములన్నిటినీ కప్పును(సామెతలు10:12)

💖 ప్రేమ మరణమంత బలవంతమైనది(పరమగీతం8:6)

💖 ప్రేమ నిష్కపటమైనది(రోమా12:9)

💖 ప్రేమ పొరుగువారికి కీడుచేయదు(రోమా13:10)

💖 ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును(1కొరంథీ8:1)

💖 ప్రేమ యధార్థమైనది(2కొరంథీ8:24)

💖 ప్రేమ పాపములను కప్పును(1పేతురు4:8)

💖 ప్రేమ ప్రాణమును పెట్టును(1యోహాను3:16)

💖 ప్రేమ భయమును పోగొట్టును(1యోహాను4:18)

చూశారా! ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో!
వివరించడం మాత్రమే ఖాదు గానీ, ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మనయెడల చూపాడు.

అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు

💖 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను(యిర్మియా31:3)

మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు.
దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము(యోహాను5:41), ఆయన మన కొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటవలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండినవారమగుదుము.

💖 ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ(2యోహాను1:6)

💖 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే(రోమా13:10)

💖 ధర్మశాస్త్రమంతయూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది(గలతీ5:14)

లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియజేస్తుంది.పైకి ప్రేమ నటించుదురు గానీ అంతరంగమున లాభమును ఆశింతురు.

💖 నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గానీ, వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది(యెహెజ్కేలు33:31)

ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ ఛెబుతోంది.

💖 ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు(1కోరింథీ13: 3)

💖 అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును(మత్తయి24:12)

💖మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి(1కొరంథీ16:14)

లోకంలోని ప్రేమకు, దేవుని ప్రేమకు ఎంతో తేడా ఉందని గమనించండి.

Refer:
* 2john1:5;
* 1john2:7; 3:22;
* john13:34; 15:12;
* mark12:31;
* mathew22:36,38

💖 ఈ ప్రేమను 10 మందికి ప్రేమను పంపించండి.ప్రేమను పొందండి.                            💖ప్రేమతో వ్రాయునది.....

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

చట్టం గురించి  తెలుసుకో క్రైస్తవ సోదర

చట్టం గురించి  తెలుసుకో క్రైస్తవ సోదర

1. మతం అనేది మనసుకు సంబంధించిన విషయం  కులం అనేది శరీరానికి సంబంధించిన విషయం ACT 1978/282 , ACT 1977/282 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకారం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూలు కులాలవారు పైన  ఎటువంటి దాడులు జరిగిన వేరే మతం వారు దాడులకు ప్రయత్నించినా కఠినంగా శిక్షించాలని తీర్పును ఇచ్చింది.

2. సుప్రీం కోర్ట్ 1986 బహు జనులు ఏ మతం అయినా స్వీకరించే స్వేచ్ఛ ఉందని  తీర్పు ఇచ్చింది.

3.  మతాన్ని నమ్మిన వారి కుటుంభ సభ్యుల నుంచి భార్య గాని భర్త గాని మతాన్ని విమర్శిస్తే తక్షణమే ఆమె/అతడు  సెక్షన్ 30(1) ప్రకారం విడాకులు పొందవచ్చు .

4. నీ భార్య గాని, తల్లి గాని కుమార్తె గాని, ప్రార్ధనా కూటములకు వెళ్లకుండా అడ్డు కుంటే వారికీ సెక్షన్ 18B/ACT 78/1956 ప్రకారం ఆర్ధిక సహాయం అందించనవసరం లేదు .

5. మతంలో ఉండి, మతాన్ని విమర్శించే మత భోధకులపై తప్పుడు విమర్శలు చేస్తే వారిపై సెక్షన్ 420 IPC చీటింగ్ కేసు పెట్టి శిక్షించవచ్చు.

6. మత విశ్వాసులను కించ పరచడం ఆహ్వానం లేని ఇంటికి వెళ్లడం కాకుండా మాటలు , చేతల ద్వారా అవమాన పరచిన లేదా కించ పరచే ప్రయత్నం చేసిన IPC 295A  ప్రకారం సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయవచ్చు .

7. IPC సెక్షన్ 153A ప్రకారం ప్రార్ధన మందిరాల సమీపం లో వైశ్య మాలను రెచ్చగొడుతూ ప్రశాంతత సామరస్య వాతావరణంను భంగం చేస్తూ మత సంస్కృతులకు విరుద్ధంగా మందిరాలలో ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులపై (మీడియా సంస్థలు పోలీస్ , రాజకీయ నాయకులు) లాంటి వారు బల ప్రదర్శన చేసి అవమానిస్తే సెక్షన్ 153A ప్రకారం శిక్షార్హులు అవుతారు .
8. IPC సెక్షన్ 153(B) ప్రకారం జాతీయ సమగ్రత విషయం లో ఒక జాతిని విమర్శిస్తూ జాతీయ సమగ్రత నమ్మకం, విశ్వాసం లోపించేలా దేశం సార్వభౌమాధికారం దేశ సమగ్రత విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు ప్రకటనలు  చేస్తూ మతాల మధ్య అపోహలు రగిలించి చేదు భావాలను ప్రచారం చేసిన 3 సంవత్సరాల వారికి జైలు శిక్షకు అర్హులు అవుతారు.

9. అనుమతి లేని సంఘంకు ప్రార్ధనా మందిరాలకు ఇంటిని అద్దెకు ఇస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆస్తుల యజమాని అద్దెదారుడు శిక్షార్హుడు.

10. జి.ఓ  నెంబర్ 367, తేదీ: 29-11-2012 AP ACT13/1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ప్రార్ధన మందిరాలకు వెళ్లి అరాచకాలు సృష్టిస్తున్న మీడియా సంస్థలను నిషేధించ వచ్చు.

11. కనుక రండి మతోన్మాదులు ఆతీతంగా క్రైస్తవులు అంతా కలసి పనిచేదాం. రాజ్యాంగ పరంగా, చట్టం న్యాయం పరంగా మన క్రైస్తవుల పై జరుగుతున్న దాడులు అడ్డుకుందాం.

12. మన దేశాన్ని క్రైస్తవ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి వుంది.

"Be unite  and fight for  our Rights"