14, ఫిబ్రవరి 2018, బుధవారం

Love letter

💖 💖 యేసు ప్రేమ లేఖ 💖 💖

ఈ ప్రశ్న యూత్ ను అడిగామనుకోండి!,
ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం, లాంటి వేదాంత ధోరణి మాటలనుండి,
ప్రేమ గుడ్డిది, నడ్డిది, చెవిటిది లాంటి బరువైన మాటల వరకూ ఇంకా చాలానే చెబుతారు.

❣ మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకూ నిజాయితీ ఉంది?
❣ ప్రేమంటే అర్థం అంతేనా?
❣ ప్రేమను గురించి బైబిల్ ఏం చెబుతుంది?

మనం బైబిల్ చదివినపుడు, బైబిలంతటిలోనూ మనపై దేవునికున్న ప్రేమ స్పష్టంగా కన్పిస్తుంది.

💖దేవుడు మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్ 💖

మరి ప్రేమంటే బైబిల్ ఏమని నిర్వచిస్తోంది?

1కొరింథీ13:4-13 లో ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి.

💖 ప్రేమ దీర్ఘకాలం సహించును

💖 ప్రేమ దయ చూపించును

💖 ప్రేమ మత్సరపడదు

💖 ప్రేమ డంబముగా ప్రవర్తింపదు

💖 ప్రేమ ఉప్పొంగదు

💖 ప్రేమ అమర్యాదగా నడవదు

💖 ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు

💖 ప్రేమ కోపపడదు

💖 ప్రేమ అపకారం చేయదు

💖 ప్రేమ సత్యమునందు సంతోషించును

💖 ప్రేమ అన్నిటికీ తాళుకొనును

💖 ప్రేమ అన్నిటినీ నమ్మును

💖 ప్రేమ అన్నిటినీ నిరీక్షించును

💖 ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును

💖 ప్రేమ శాశ్వతకాలముండును

💖 ప్రేమ దోషములన్నిటినీ కప్పును(సామెతలు10:12)

💖 ప్రేమ మరణమంత బలవంతమైనది(పరమగీతం8:6)

💖 ప్రేమ నిష్కపటమైనది(రోమా12:9)

💖 ప్రేమ పొరుగువారికి కీడుచేయదు(రోమా13:10)

💖 ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును(1కొరంథీ8:1)

💖 ప్రేమ యధార్థమైనది(2కొరంథీ8:24)

💖 ప్రేమ పాపములను కప్పును(1పేతురు4:8)

💖 ప్రేమ ప్రాణమును పెట్టును(1యోహాను3:16)

💖 ప్రేమ భయమును పోగొట్టును(1యోహాను4:18)

చూశారా! ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో!
వివరించడం మాత్రమే ఖాదు గానీ, ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మనయెడల చూపాడు.

అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు

💖 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను(యిర్మియా31:3)

మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు.
దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము(యోహాను5:41), ఆయన మన కొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటవలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండినవారమగుదుము.

💖 ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ(2యోహాను1:6)

💖 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే(రోమా13:10)

💖 ధర్మశాస్త్రమంతయూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది(గలతీ5:14)

లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియజేస్తుంది.పైకి ప్రేమ నటించుదురు గానీ అంతరంగమున లాభమును ఆశింతురు.

💖 నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గానీ, వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది(యెహెజ్కేలు33:31)

ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ ఛెబుతోంది.

💖 ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు(1కోరింథీ13: 3)

💖 అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును(మత్తయి24:12)

💖మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి(1కొరంథీ16:14)

లోకంలోని ప్రేమకు, దేవుని ప్రేమకు ఎంతో తేడా ఉందని గమనించండి.

Refer:
* 2john1:5;
* 1john2:7; 3:22;
* john13:34; 15:12;
* mark12:31;
* mathew22:36,38

💖 ఈ ప్రేమను 10 మందికి ప్రేమను పంపించండి.ప్రేమను పొందండి.                            💖ప్రేమతో వ్రాయునది.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి