6, జూన్ 2017, మంగళవారం

✳ ప్రత్యేకపరచబడిన జనాంగం

✳ ప్రత్యేకపరచబడిన జనాంగం....✍
( Leviticus (లేవీయకాండము) 20:26 )
"యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని."
👉మన దేవుడు తన బిడ్డలను అన్యజనాంగం నుండి వేరుచేశారు....
🔺అలాగే మన దేవుడు తన బిడ్డలు అన్యజానాంగం నుండి వేరుగా వుండాలని ఆశిస్తున్నారు.
👉క్రేస్తవులు ప్రత్యేకపరచబడిన జనాంగం.... 🔺క్రేస్తవులు ప్రత్యేకమైన జనాంగం.
🔸ఈ ప్రత్యేకత ఒక మతం వల్లనో ఒక సమాజికవర్గం వల్లనో మనకి వచ్చింది కాదుగానీ మనం కలిగియున్న దేవుని వలన మనకి ఈ ప్రత్యేకత ఏర్పడింది.

👉నా ప్రియ స్నేహితులారా....
ఇశ్రాయేలీయుల 430 సం!!రాల బానిస సంకెళ్ళు తెంచివేయబడ్డాయి.... సేన్యములకు అధిపతియైన యెహోవాయే పగలు మేఘస్థంభంవాలే, రాత్రి అగ్ని స్థంభంవాలే ఇశ్రాయేలీయులకు తోడుగావుండి నడిపించారు. ఇగుప్తు నుండి వాగ్ధాన దేశానికి ఇశ్రాయేలీయుల
🔹ఈ ప్రయాణం అనేక మలుపులతో కూడినది,
🔹అనేక మార్పులతో కూడినది.
ఇగుప్తు నుండి వాగ్ధాన దేశానికి వెళ్ళే ఈ మార్గంలోనే
🔺యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులలోని బలహీనులను బలపరిచే ప్రయత్నం చేసారు....
🔺అల్పవిశ్వాసులను స్థిరపరచే ప్రయత్నం చేసారు....
🔺 పిరికి వారిని యుద్ధ శూరులుగా మార్చే ప్రయత్నం చేసారు....
🔺నేలచూపులు చూసే వారిని ఆకాశంవైపు తేరిచూసేవారిగా మార్చే ప్రయత్నం చేసారు....
👉 వీటిఅన్నిటి కన్నా ప్రాముఖ్యంగా ఈ మార్గంలోనే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ప్రత్యేకపరచబడిన జనాంగంగా, ప్రత్యేకమైన జనాంగంగా మార్చే ప్రయత్నం చేసారు.

➡లేవియకాండము చదివితే ఈ విషయాలు మనకి పూర్తిగా అర్ధం అవుతాయి.
"మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు."
( Leviticus (లేవీయకాండము) 18:1-3)

👉దేవుని బిడ్డలు ఇగుప్తు అలవాట్లతో,
👉ఇగుప్తు ఆచారాలతో,
👉ఇగుప్తు కట్టడలతో,
👉ఇగుప్తు విధివిధానాలతో వాగ్ధాన దేశంలోకి ప్రవేశించటానికి దేవుడు ఇష్టపడలేదు....
👉అలాగే వీరు కనానుకి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న కనాను అన్యజాతుల అలవాట్లలో, ఆచారాలలో కలిసిపోటానికి కూడా దేవుడు ఇష్టపడలేదు....
👉అందుకే ఇగుప్తు నుండి వాగ్ధాన దేశానికి వెళ్ళే మార్గంలోనే ఇశ్రాయేలీయుల అలవాట్లు, ఆచారాలు, కట్టడలు, విధివిధానాలు... ఇలా అన్ని దేవుడు మర్చివేసారు.

👉 నా ప్రియ స్నేహితులారా....
దేవుడైన యెహోవా ఇలాగు చెబుతున్నారు....
మీరు విడచివచ్చిన ఇగుప్తు దేశపు ఆచారాలు ఆచరించకూడదు.
మీరు వేళ్ళబోతున్న కనాను దేశంలోని అన్యుల ఆచారాలు ఆచరించకూడదు అని....

🔺"ఐగుప్తు" :
లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు మనలను లోకం నుండి రక్షించి, విడిపించారు ఇప్పుడు మనం విడచివచ్చిన ఆ లోకపు ఆచారాలు, సంప్రదాయాలు ఆచరించకూడదు.

🔺కనాను:
క్రెస్తవ జీవితనికి సాదృశ్యంగా ఉంది. ఆనాటి కనానులో ఎలా అయితే కొన్ని అన్యజాతులు, అన్యఆచారాలు ఉన్నాయో... అలాగే ఈనాటి క్రెస్తవ జీవితంలో, క్రెస్తవ సమాజంలో కూడా కొన్ని అన్యఆచారాలు ఉన్నాయి, క్రేస్తవ్యంలో ఈ అన్యఆచారాల రూపకర్తలు నామకార్ధ క్రేస్తవులే.
దేవుడు అంటున్నారు....
🔹కనాను అన్యజాతుల ఆచారాలు మీరు ఆచరించకూడదు.
🔹క్రేస్తవ్యంలోని అన్యఆచారాలు మనం ఆచరించకూడదు,
🔹నామకర్ధ క్రేస్తవుల ఆచారాలు మనం ఆచరించకూడదు.

👉నా ప్రియ స్నేహితులారా....
దేవుడు తన కొరకు ఒక ప్రత్యేక జనాంగంగా మనం ఉండాలి అని ఆశిస్తున్నారు. అందుకే ఇశ్రాయేలీయులను ఇగుప్తుకి మరియు వాగ్ధాన దేశానికి మధ్యం నిలువబెట్టిమరీ ప్రత్యేకపరచబడిన జనంగంగా ప్రతిష్టించారు.

➡ ఇంతకీ ఏమిటి మన ప్రత్యేకత. . . . ?

👉అన్నిటియందు స్వచ్చవున్నా అన్ని చేయదగినవి కావు అని గ్రహించి వుండుటే మన ప్రత్యేకత.
👉విగ్రహారాధన చేయగలిగి వుండి కూడా చేయకుండా వుండటం మన ప్రత్యేకత.
👉వ్యేబిచారం చేయగలిగి వుండి కూడా చేయకుండా వుండటం మన ప్రత్యేకత.
👉లంచం తీసుకోవటం, మోసపు పనులు చేయగలిగి వుండి కూడా చేయకుండా వుండటం మన ప్రత్యేకత.
👉ఈ లోకపు క్రియలు చేయగలిగి వుండి కూడా చేయకుండా వుండటం మన ప్రత్యేకత.
👉అన్యుల వాలే పండుగలు చేయగలిగి వుండి కూడా చేయకుండా వుండటం మన ప్రత్యేకత.
స్వయంగా దేవుడే ఇలా చెబుతున్నారు.... “జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే” (లేవీ 20:24b) దేవుడే మనలను వేరుపరచారు....
🔺 తిరిగి లోకంలో కలవటానికి విలులేదు,
🔺వెళ్లివెళ్లి నామకర్ధ క్రేస్తవుల ఆచారాలలో కలవటానికి కూడా విలులేదు.
👉మనం ప్రత్యేకపరచబడిన జనాంగం....
మరి...
➡ మన విధివిధానాలు ఏమిటి...?
➡మనకున్న కట్టడాలు ఏమిటి...?

🔺లేవి 18:4 లో యెహోవా దేవుడు ఇలా అంటున్నారు.... "మీరు నా విధులను గైకొనవలేను, నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరించవలెను” అని....
విధులు, కట్టడలు గురించి 119వ కీర్తన చదివిన ప్రతివారికీ సులువుగా అర్ధం అవుతుంది....
👉దేవుని విధులు, దేవుని కట్టడాలు అంటే ఇంక ఏమిటోకాదు అది ఈ దేవుని వాక్యమే...
👉ఈ బైబిల్ లోనే మన విధులు ఉన్నాయి ఈ బైబిల్ లోనే మన కట్టడాలు ఉన్నాయి. ఈ బైబిల్ మనకున్న ఏకైక సిధంతం.
👉లోకంపు ఆచారాలను బట్టి మనం నడువకూడదు,
👉నామకర్ధ క్రేస్తవుల ఆచారాలను బట్టి మనం నడువకూడదు,
🔺బైబిల్ ను బట్టియే మన నడక, నడత ఉండాలి.
దేవుడు ఆశించినట్లు మనం దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంటె దేవుడు మనలను చేర్చుకుంటారు, మన మధ్య నివసిస్తారు, మనతో సంచరిస్తారు, మనకి తండ్రిగా ఉంటారు, మనం ఆయనకు ప్రజలముగా, కుమారులం,కుమార్తేలంగా ఉంటాము. (2 కోరింది 6:18 b)
హల్లెలూయ. . . .
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.
----------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి